జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 106 వినతులు
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 106 వినతులు వచ్చాయని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తెలిపారు. జీవీఎంసీ పాత సమావేశ మందిరంలో కమిషనర్ సంపత్‌కుమార్‌తో కలిసి మేయర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోన్–2 నుంచి 13, జోన్–3 నుంచి 19, జోన్–4 నుంచి 8, జోన్–5 నుంచి 5, జోన్–6 నుంచి 10, జోన్–8 నుంచి 15 ఫిర్యాదులు రాగా, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సంబంధించి 36 ఫిర్యాదులు అందాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఆర్.సోమన్నారాయణ, ప్రధాన ఇంజనీర్ శివప్రసాదరాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్కుమార్, సీపీ మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment