భీమిలిలో ఉన్న ఈ భవనంలో ప్రభుత్వ ఎస్సీ బాలుర సాంఘిక సంక్షేమశాఖ కళాశాల వసతి గృహం నడుస్తోంది. సుమారు 40 ఏళ్ల క్రితం ఈ వసతి గృహాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇందులో ఇంటర్ నుంచి డిగ్రీ చదువుతున్న 80 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ భవనం పూర్తిగా శిథిలమైపోయింది. రెండో విడత నాడు–నేడులో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈలోగా ప్రభుత్వం మారిపోవడం.. కొత్త ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేయడంతో విద్యార్థుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. పైకప్పుల పెచ్చులు ఊడిపడిపోతుండడంతో విద్యార్థులు రాత్రి పూట బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరుగుదొడ్లు పూర్తిగా దెబ్బతినడంతో కొందరు విద్యార్థులు బహిర్భూమికి బయటకు వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment