భూకబ్జాలకు పాల్పడిన వారిపై విచారణ చేయాలి
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో దాదాపు రూ.350 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు కట్టబెట్టిన ఒక ఉన్నతాధికారి, అందులో భాగస్వాములైన ప్రజాప్రతినిధులపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. విజయనగరం జిల్లాలో గతంలో జరిగిన భూకబ్జాలకు సంబంధించి కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ చేసి భూకబ్జాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడానికి వీలైనంత త్వరగా నివేదికలోని విషయాలపై లోతైన విచారణకు ఆదేశించాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
రూ.350 కోట్ల భూమిని అక్రమార్కులకు కట్టబెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి
సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన శాసనమండలి విపక్షనేత బొత్స
Comments
Please login to add a commentAdd a comment