తగరపువలస: ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ సర్వే నంబర్ 123, 347లో అనుమతి లేకుండా తవ్వి, తరలించిన గ్రావెల్‌కు గాను జిల్లా గనులు, భూగర్భశాఖ భారీ జరిమానా విధించింది. ఆ జరిమానా కట్టాలని సంబంధిత వ్యక్తులకు ఈ నెల 13న డిమాండ్ నోటీసు పంపారు. సమాచార హక్కు చట్ట ప్రకారం అందిన ఫిర్యాదు మేరకు కార్యాలయ రాయల్టీ ఇన్‌స్పెక్టర్, జిల్లా నిఘా విభాగపు రాయల్టీ ఇన్‌స్పెక్టర్, వీఆర్వో, సర్వేయర్లు గ్రావెల్ తరలించినట్టు నిర్ధారించారు. సదరు సర్వే నంబర్ల నుంచి 63,495 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించినందుకు గాను రూ.2.09 కోట్ల జరిమానా కట్టాలని జిల్లా అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment