ఆకట్టుకుంటున్న ‘విశేష’ జ్యూయలరీ ప్రదర్శన
ఏయూక్యాంపస్: మహిళల మనసుకు నచ్చే డిజైనర్ ఆభరణాల ప్రదర్శనను వైభవ్ జ్యూయలర్స్ విశేష కలెక్షన్స్ పేరుతో ప్రారంభించింది. బీచ్‌రోడ్డులోని గ్రాండ్ బే హోటల్‌లో రెండు రోజుల ప్రదర్శనను ఎ.అలేఖ్య, కె.స్నేహ, వైభవ్ జ్యూయలర్స్ సీఎండీ భారత మల్లిక రత్నకుమారి, డైరెక్టర్ కీర్తన గ్రంధి ప్రారంభించారు. రూ.5 లక్షలలోపు ఇన్‌స్పైర్డ్, హ్యాండ్ క్రాఫ్ట్‌డ్, క్యూరేటెడ్ డిజైనర్ డైమండ్ ఆభరణాలు, పేస్టెల్ ఆక్వా కలెక్షన్, విక్టోరియన్, గోల్డ్, ఏంటిక్, ఫ్యూజన్, సిజెడ్ డైమండ్ ఆభరణాల క్యూరేటెడ్ కలెక్షన్‌ను ఇక్కడ ప్రదర్శించారు. ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని వైభవ్ జ్యూవెలర్స్ చైర్‌పర్సన్ గ్రంధి మల్లికా మనోజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment