క్రీడలతో మానసిక ఉల్లాసం
● జీసీసీ ఎండీ కల్పనా కుమారి
కొమ్మాది: బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని జన జాతి గౌరవ దివస్‌లో భాగంగా రుషికొండలోని గాయత్రి పీజీ, డిగ్రీ కళాశాలలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యా యి. రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ మిషన్(టీసీఆర్‌టీఎం) ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను శనివారం జీసీసీ ఎండీ కల్పనా కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఆనందంతో పాటు ఉల్లాసం కలిగిస్తాయన్నారు. ఈ పోటీ ల్లో 8 ఐటీడీఏలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. కాగా.. వీరికి ఆర్చరీ, జావెలిన్ త్రో, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీసీఆర్‌టీఎం ఆవరణలో ఏర్పాటు చేసిన గిరిజన సంతను జీసీసీ ఎండీ ప్రారంభించారు. ఇక్కడ వివిధ ఐటీడీఏలకు చెందిన గిరిజన రైతులు/చేతివృత్తుల వారు 10 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ సంత ఈ నెల 26 వరకు జరగనుంది. టీసీఆర్‌టీఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాణి మందా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment