No Headline
కార్తీక మాసం నాలుగో ఆదివారం కై లాసగిరి, జూ పార్కు, కంబాలకొండ, ముడసర్లోవ, తెన్నేటి పార్కు, శివాజీ పార్కు తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడాయి. వేలాది మంది సందర్శకులు, నగర ప్రజలు వన భోజనాలు చేసి.. ఆటపాటలతో రోజంతా సరదాగా గడిపారు. కై లాసగిరిపై ప్రధాన ద్వారం, శివపార్వతుల విగ్రహాలు,
ఐ లవ్ వైజాగ్ పాయింట్‌ల వద్ద ఫొటోలు దిగారు. కాగా.. జూ పార్కును ఆదివారం 13,650 మంది సందర్శించినట్లు ఇన్‌చార్జి క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. సందర్శకుల ద్వారా రూ.9,61,724 ఆదాయం లభించినట్లు వెల్లడించారు. అలాగే కంబాలకొండ ఎకో టూరిజం పార్కు సందర్శకులతో కళకళలాడింది. అధిక సంఖ్యలో ప్రజలు వన భోజనాలు చేశారు. ఇక్కడ కొలనులో కయాకింగ్ చేస్తూ సందడి చేశారు. సుమారు 1,500 మంది కంబాలకొండను సందర్శించగా.. రూ 1.10 లక్షల ఆదాయం లభించింది. – ఆరిలోవ
Comments
Please login to add a commentAdd a comment