డాబాగార్డెన్స్: మార్గశిరమాసంలో భక్తుల సౌకర్యార్థం పంచ వైష్ణవ క్షేత్ర దర్శినికి ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. మార్గశిర మాసంలో వచ్చే 7, 14, 21, 18 తేదీల్లో రాత్రి 9 గంటలకు ద్వారకా బస్‌స్టేషన్ నుంచి బస్సులు బయలుదేరుతాయని చెప్పారు. ద్వారకాతిరుమల(శ్రీ వేంకటేశ్వర స్వామి), అంతర్వేది(శ్రీలక్ష్మీ నరసింహస్వామి), అప్పన్నపల్లి(శ్రీ బాల బాలాజీ), గొల్లల మామిడాడ(కోదండ రామాలయం), అన్నవరం(శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి) పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తిరిగి విశాఖ రావడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ప్రయాణ చార్జీ(సూపర్ లగ్జరీ) ఒక్కొక్కరికీ రూ.1,800గా నిర్ణయించారు. https://www. apsrtconline.inలో పంచ వైష్ణవ క్షేత్ర దర్శిని రూట్ సెలెక్ట్ చేసి సీట్లు రిజర్వ్ చేసు కోవచ్చు. అలాగే ద్వారకా బస్‌స్టేషన్‌లోని రిజర్వేష న్ కౌంటర్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని అప్పలనాయుడు తెలిపారు. మరిన్ని వివరాలకు 99592 25602, 90522 27083, 99592 25594, 91001 09731లో సంప్రదించవచ్చు. కాగా.. కార్తీకమాసంలో పంచారామాల దర్శనంలో భాగంగా ఆదివారం ద్వారకా బస్‌స్టేషన్ నుంచి 11 ఆర్టీసీ బస్సులు బయలుదేరాయి. ఈ బస్సులను జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment