బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే
● గత ప్రభుత్వ హయాంలో
బీసీలకు పెద్ద పీట
● వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా
అధ్యక్షుడు అమర్‌నాథ్
డాబాగార్డెన్స్: వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కొనియాడారు. రాజ్యసభ పదవుల్లో బీసీలకు అవకాశం ఇచ్చారని తెలిపారు. జ్యోతిరావు పూలే వర్ధంతి పురస్కరించుకొని జడ్జికోర్టు సమీపంలో గల పూలే విగ్రహానికి మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ పలువురు పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలే మార్గంలో నడుస్తూ బీసీలకు పెద్ద పీట వేశారన్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, నామినేటెడ్ పదవుల్లో అగ్రస్థానం కల్పించారని, రాజ్యసభ పదవుల్లో బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదవాడికి సంక్షేమాన్ని దూరం చేసిందన్నారు. కూటమి పాలనకు మంగళవారం అప్పు రోజుగా మారిందని ఎద్దేవా చేశారు. ఆరు నెలల పాలనలో 60 వేల కోట్లకు పైగా అప్పులు తెచ్చారని, 2.5 లక్షల మంది వలంటీర్లను తొలగించారని, తొలి సంతకం పెట్టిన డీఎస్సీకి అతీగతీ లేదన్నారు. ఒక్క హామీని ఆరు నెలల కాలంలో నిలబెట్టుకోలేదని విమర్శించారు. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ పూలే సంస్కరణల్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేర్ల విజయచందర్, కార్పొరేటర్లు పీవీ సురేష్, బిపిన్‌కుమార్ జైన్, కేవీ శశికళ, రెయ్యి వెంకటరమణ, గుండెపు నాగేశ్వరరావు, బల్లా లక్ష్మణ్, లావణ్య కృష్ణారావు, శశికళ, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ షరీఫ్, పార్టీ న్యాయ విభాగం నాయకుడు నీలాపు కాళిదాసురెడ్డి, నియోజకవర్గం పరిశీలకుడు మొల్లి అప్పారావు, పార్టీ నాయకులు కొండా రాజీవ్‌గాంధీ, పేడాడ రమణకుమారి, తిప్పల దేవన్‌రెడ్డి, డాక్టర్ జహీర్ అహ్మద్, పిల్లి సుజాత, పల్లా చిన్నతల్లి, అల్లంపల్లి రాజబాబు, డాక్టర్ తుల్లి చంద్రశేఖర్ యాదవ్, నడింపల్లి కృష్ణంరాజు, కంట్రెడ్డి రామన్నపాత్రుడు, జీలకర్ర నాగేంద్ర, సతీష్‌వర్మ, పీతల వాసు, అలపున కనకారెడ్డి, సనపల రవీంద్ర భరత్, వంకాయల మారుతీప్రసాద్, డాక్టర్ మూగి శ్రీనివాసరావు, సుజాత, నూకరాజు, దొడ్డి బాపూ ఆనంద్, బుల్లెట్ రవి, శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment