అనంత పద్మనాభ స్వామి ప్రాచీన ఆలయాలు భారతదేశంలో రెండు చోట్ల ఉన్నాయి. అందులో ఒకటి కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం, రెండోది మన జిల్లాలోని పద్మనాభం గ్రామంలోని గిరిపై ఉంది. ఎక్కడా జరగని విధంగా ఏటా కార్తీక బహుళ అమావాస్య రోజున అనంత పద్మనాభ స్వామి కొండ మెట్ల పంక్తిపై దీపాలంకరణ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. గిరి పాదం నుంచి గిరి శిఖరం వరకు 1,200 మెట్లకిరువైపులా తైల దీపాలంకరణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించి.. హైందవ సంప్రదాయ విశిష్టతను ఎల్లెడలా వ్యాపింపజేస్తున్నారు ఈ ప్రాంత భక్త జనం. స్వామి వారి దీపోత్సవంలో పాల్గొంటే స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మహిళలు తాము పుణ్యవతులు కావడానికి కార్తీక దీపోత్సవంలో పాల్గొనడమే ఉత్తమమని భావిస్తారు. అందుకే దీపోత్సవం రోజు మధ్యాహ్నం నాటికే వీరు పద్మనాభం చేరుకుని దీపాలు వెలిగించడానికి కొండ మెట్లను పోటీ పడి రిజర్వ్ చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment