శ్రీనివాసుడికి దీపారాధన
ఆనందపురం మండలం గంభీరం ఐఐఎంవీ రోడ్డులోని హరేకృష్ణ వైకుంఠం వద్ద హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రెండో రోజైన గురువారం శ్రీనివాసుడికి లక్ష దీపోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కృష్ణకిశోర్ చేతుల మీదుగా ఆకాశదీపాన్ని ఆవిష్కరించారు. అంబరీష దాస ఆధ్వర్యంలో తులసి హారతితో కార్యక్రమాన్ని ప్రారంభించి వివిధ సంగీత వాయిద్యాల మధ్య దామోదర అష్టకం ఆలపించారు. భక్తులు స్వయంగా వైకుంఠవాసుడికి, దామోదర కృష్ణుడికి నెయ్యి దీపాలతో
హారతులిచ్చారు. అనంతరం
హరేకృష్ణ వైకుంఠంలోని అన్ని దీపాలను వెలిగించి లక్ష దీపోత్సవం నిర్వహించారు. శ్రీకాంత్ రఘు గ్రూప్చే కృష్ణలీలలను కూచిపూడి నృత్య రూపంలో కళ్లకు కట్టినట్టుగా
ప్రదర్శించారు. భక్తి పారవశ్యంతో భజన కార్యక్రమాలు నిర్వహించారు. చివరిగా భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
– తగరపువలస
Comments
Please login to add a commentAdd a comment