తాటిచెట్లపాలెం : వందే భారత్ రైళ్లకు త్వరలో అదనపు కోచ్‌లు జతచేయనున్నారు. ప్రస్తుతం 8 కోచ్‌లతో నడుస్తున్న సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్(20707/20708) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 16 కోచ్‌లతో నడవనుంది. ప్రస్తుతం 16 కోచ్‌లతో నడుస్తున్న విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం (20833/20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ త్వరలో 20 కోచ్‌లతో నడవనుంది.
కిరండూల్‌కు అదనపు కోచ్‌లు : విశాఖపట్నం–కిరండూల్(08551) పాసింజర్ స్పెషల్‌కు డిసెంబరు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 1–స్లీపర్ క్లాస్ కోచ్, డిసెంబరు 6,8,10,12,14,16,18,20,22, 24,26,28,30, జనవరి 1వ తేదీల్లో 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లను జతచేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో కిరండూల్–విశాఖపట్నం(08552) పాసింజర్ స్పెషల్‌కు డిసెంబరు 2వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు 1–స్లీపర్ క్లాస్ కోచ్, డిసెంబరు 7,9,11,13,15,17, 19,21,23,25,27,29,31, జనవరి 2వ తేదీల్లో 1–థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌ను జతచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment