ఎన్టీపీసీకి ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
పరవాడ: ిసంహాద్రి ఎన్టీపీసీకి 2024కు గానూ ప్రతిష్టాత్మక ఎనర్జీ కన్జర్వేషన్ రజత పురస్కారం లభించింది. థర్మల్ పవర్ ప్రాజెక్టులో శక్తి సంరక్షణ, శక్తి సామర్థ్యం కేటగిరీలో ఈ అవార్డును ఏపీ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అందించింది. సంస్థ తరఫున ఏజీ ఎం(ఈఈఎంజీ) నవీన్ కిశోర్, ప్రభుత్వ ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్‌లు శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఈ పురస్కారం స్థిరత్వం పట్ల సంస్థకు ఉన్న తిరుగులేని నిబద్ధతను చాటిచెబుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment