డాబాగార్డెన్స్: అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు, కొండవాలు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. కొండ చరియలు విరిగిపడే పరిస్థితులు ఉన్నందున ఆయా ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులతో పాటు యూసీడీ పీడీ సత్యవేణిని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు, విద్యుత్, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment