చతికిలబడి | - | Sakshi
Sakshi News home page

చతికిలబడి

Published Sat, Dec 21 2024 1:35 AM | Last Updated on Sat, Dec 21 2024 1:35 AM

చతికి

చతికిలబడి

వెలుగుల జడి
నాడు
నేడు
జగనన్న పాలనలో పేద పిల్లల చదువులకు పెద్దపీట

రుచీపచీ లేని

మధ్యాహ్న భోజనం

2024–25 విద్యా సంవత్సరంలో నమోదైన గణాంకాల మేరకు 581 పాఠశాలల్లోని 72,892 మంది విద్యార్థులకు బడిలో మధ్యాహ్న భోజనం అందించేలా ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపులు చేస్తోంది. వీటిలో 338 స్కూళ్లలోని సుమారు 47 వేల మంది విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ద్వారా భోజనం సరఫరా చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద పీట వేసేలా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మెనూ రూపొందించగా.. ప్రస్తుతం ఇదే కొనసాగుతోంది. వారంలో ఐదు రోజులు కోడిగుడ్లు, రోజుకో రకమైన వంటకం, వేరుశనగ చిక్కీ,రాగి జావ రుచిగా, శుచిగా అందించడంతో విద్యార్థులు ఎంతో ఇష్టపడి తినేవారు. కూటమి ప్రభుత్వం మెనూ మార్పు చేస్తామని ప్రకటన చేయడంతో.. ప్రస్తుతం విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత లోపించింది. జిల్లా విద్యాశాఖాధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో బడి భోజనం అధ్వానంగా తయారైంది. వండిన పదార్థాలు రుచిగా లేక.. చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఇళ్ల నుంచే క్యారేజీలు తెచ్చుకుని తింటున్న దుస్థితి నెలకొంది.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

ఇచ్చేదెప్పుడో.?

న్నత విద్యనభ్యసించే పేద విద్యార్థులకు 2019కు ముందు చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి కోర్సుకై నా ఏడాదికి రూ.35వేలు మాత్రమే ఇచ్చేది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయటంతో పాటు ఠంఛన్‌గా నిధులు మంజూరు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్‌మెంట్‌ అమలుకు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఫలితంగా కాలేజీల యాజమాన్యాలు ఫీజు కట్టాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫీజుల కట్టలేక సతమతమవుతున్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో వసతి దీవెన, విద్యాదీవెన అమలు ఇలా..

సంవత్సరం విద్యార్థులు మంజూరైన డబ్బులు విద్యార్థులు మంజూరైన డబ్బులు

(వసతి దీవెన) (విద్యా దీవెన)

2019–20 41,913 110,48,84,249 39,549 36,87,92,500

2020–21 49,205 97,52,68,301 49,332 46,10,22,500

2021–22 49,090 120,25,51,441 49,427 44,90,82,500

2022–23 45,326 93,41,66,638 45,267 41,11,35,000

No comments yet. Be the first to comment!
Add a comment
చతికిలబడి 1
1/2

చతికిలబడి

చతికిలబడి 2
2/2

చతికిలబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement