అభివృద్ధి పథంలో హెచ్‌పీసీఎల్
సాక్షి, విశాఖపట్నం: పర్యావరణహిత ప్రాజెక్టులు, విస్తరణ పనులతో హెచ్‌పీసీఎల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సంస్థ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.రామకృష్ణన్ అన్నారు. రిఫైనరీలో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవంలో ఈడీ రామకృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్ జవాన్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రామకృష్ణన్ మాట్లాడుతూ సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హెచ్‌పీసీఎల్‌లో 15 నుంచి 40 ఏళ్ల వరకూ విధులు నిర్వరిస్తూ సేవలందిస్తున్న అధికారులు, ఉద్యోగులకు సర్వీస్ సర్టిఫికెట్లు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సీజీఎం ఈడీవీఆర్ అభిషేక్ త్రివేది, హెచ్‌ఆర్ సీజీఎం కిరణ్‌కుమార్‌తో పాటు హెచ్‌పీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment