446 మందికి ప్రతిభా పురస్కారాలు
జీవీఎంసీ శకటానికి ప్రథమ బహుమతి
వివిధ విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా తొమ్మిది శకటాలను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ విశాఖపై జీవీఎంసీ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై విద్యాశాఖ, ఎస్‌ఎస్‌ఏ, దీపం–2 పథకంపై పౌరసరఫరాల శాఖ, నా ఆరోగ్యం– నా హక్కు అనే అంశంపై వైద్యారోగ్య శాఖ, పేదరికం లేని సమాజమే–మన ప్రభుత్వ ఆశయం అనే అంశంపై డీఆర్డీఏ, మహిళా సాధికారతను తెలియజేస్తూ సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, పీఎం సూర్యఘర్ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ఈపీడీసీఎల్, ప్రగతికి 10 సూత్రాల స్వర్ణాంధ్ర సాకారం అనే అంశంపై గృహ నిర్మాణ శాఖ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యాచరణ అనే అంశాలతో కూడిన శకటాలు ఆకర్షించాయి. జీవీఎంసీ శకటానికి మొదటి బహుమతి రాగా.. డీఆర్డీఏకు ద్వితీయ, వీఎంఆర్డీఏ శకటానికి తృతీయ బహుమతి లభించింది.
వీఎంఆర్డీఏ శకటం
డీఆర్డీఏ శకటం
ప్రత్యేక ఆకర్షణగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శకటం
8లో
1
3
2
Comments
Please login to add a commentAdd a comment