రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
● వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం ● జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం : ప్రస్తుతం మన రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. విదేశాల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం గురించి చంద్రబాబు, ఆయన తనయుడు చెప్పుకుంటూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయ్‌చందర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ మంత్రి అమర్‌నాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల హక్కులను వైఎస్సార్ సీపీ కాపాడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొస్తామని దావోస్‌కు వెళ్లిన సీఎం చంద్రబాబు పెట్టుబడులు రాకపోయేసరికి మాట మార్చారని విమర్శించారు. దావోస్ పర్యటన ఒక మిథ్య అంటూ మాట్లాడుతున్నారని, పదిసార్లు దావోస్ వెళ్లి వచ్చిన తరువాత ఆ విషయం తెలిసిందా..? అని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. విజయసాయిరెడ్డి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని స్వయంగా చెప్పారని తెలిపారు. తనలాంటి వారిని వెయ్యి మందిని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తయారు చేయగలరని విజయసాయిరెడ్డి పేర్కొన్నారని వివరించారు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం లోటుగానే భావిస్తామన్నారు. గతంలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు చంద్రబాబు మీద నమ్మకం లేకనే ఆ పార్టీని వీడిపోయారా..? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జెడ్పీ చైర్‌పర్సన్ జె.సుభద్ర, సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, చింతలపూడి వెంకటరామయ్య, జిల్లా పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవిరెడ్డి, కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్, పార్టీ ముఖ్య నాయకులు రొంగలి జగన్నాథం, మొల్లి అప్పారావు, ద్రోణంరాజు శ్రీ వాత్సవ్, పేడాడ రమణకుమారి, నడింపల్లి కృష్ణంరాజు, డా. జహీర్ అహ్మద్, అల్లంపల్లి రాజాబాబు, పార్టీ నాయుకులు రామన్న పాత్రుడు, మారుతి ప్రసాద్, బి.పద్మావతి, కె.వి.బాబా, సేనాపతి అప్పారావు, కాళిదాసు రెడ్డి, లక్ష్మి, రాము, అప్పన్న, పి.ప్రేమ, లావణ్య, పల్ల దుర్గ, అప్పలనాయుడు, మరియా దాస్, గణేష్, జగుపల్లి నరేష్, మళ్ల శ్రీదేవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment