సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు సోమవారం జరగనుంది. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి కె.జ్ఞానవేణి తెలిపారు. బీచ్ రిసార్టులు, అడ్వెంచర్, క్రూయిజ్ టూరిజం, ఎకో టూరిజం, అరకు కాఫీ, 2024–29 పర్యాటక పాలసీ తదితర అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలో టూరిజం శాఖకు సంబంధించి 15 ల్యాండ్ పాకెట్స్ ఉన్నాయని.. టర్నోవర్‌ను బట్టి ఆసక్తి గల సంస్థలకు భూ కేటాయింపులు జరుగుతాయని.. ఈ అంశంపైనా సదస్సులో చర్చించనున్నామన్నారు. దిగ్గజ కంపెనీల ప్రతినిధులు భాగస్వామ్యం కానున్న ఈ సదస్సును పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించనున్నారని తెలిపారు. సమ్మిట్‌కు ఏపీటీడీసీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, అధికారులు హాజరుకానున్నారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment