పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్ల పరిశీలన
మురళీనగర్ : కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాట్లను తిరుపతి ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎ.నిర్మల్ కుమార్ ప్రియ ఆదివారం పరిశీలించారు. ఈ మేరకు ఆయన కాలేజీని సందర్శించి ప్రిన్సిపాల్ కె.నారాయణరావు, ఇతర సిబ్బందితో చర్చించారు. పోటీల్లో తలపడాల్సిన టీమ్‌లకు సంబంధించి లాటరీని తీసి ప్రకటించారు. అనంతరం క్రీడా మైదానాన్ని పరిశీలించి ట్రాక్ అండ్ ఫీల్డ్‌ల మార్కింగ్‌లపై పలు సూచనలు చేశారు. స్టేజీ ఏర్పాట్లతోపాటు క్రీడాకారుల వసతి కల్పనకు ఎంపిక చేసిన భవనాలు, వాటి గదుల్లోని సౌకర్యాలను పరిశీలించారు. డిప్యూటీ సెక్రటరీ కె.లక్ష్మిపతి, గేమ్స్ అండ్ స్పోర్ట్సు మీట్ కన్వీనర్ డాక్టర్ కె.నారాయణరావు, కో–కన్వీనర్ డాక్టర్ బి.జానకీరామ్, హెవోడీలు కేడీవీ నరసింహారావు, కె.మధుకుమార్, డాక్టర్ రత్నకుమార్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment