No Headline
గత ఏడాది ఆగస్టు 25వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గిరిజన యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన చిత్రమిది. అదే చోట కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శాశ్వతం కానుంది. నిబంధనల ప్రకారం గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాల్సిన ఈ విద్యాదీపం వారి ప్రాంతంలోనే, వారికి చెంతనే ఉండాలి. 2014–19 నాటి టీడీపీ ప్రభుత్వం ఆ నిబంధనలను సైతం తుంగలోకి తొక్కి అందుకు భిన్నంగా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలంలోని రెల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేయాలని అక్కడ భూసేకరణ చేసింది. అందులో చాలావరకూ ప్రభుత్వ భూమే. ప్రహరీ నిర్మాణ పనులు మాత్రమే రూ.10 కోట్లతో చేపట్టింది. అవీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2014 నుంచి గ్రామాల్లో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయానికి వసతి చూపించింది. విజయనగరం శివారులోని గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్ భవనాల్లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసింది. చట్టం లక్ష్యం ప్రకారం శాశ్వత భవనాల నిర్మాణానికి ఎస్టీ రిజర్వుడ్ సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 561.88 ఎకరాల సువిశాలమైన ప్రకృతి రమణీయతతో కూడిన స్థలాన్ని కేటాయించింది. శరవేగంగా భూసేకరణను పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. ఇప్పుడు అక్కడే రూ.834 కోట్లతో శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment