No Headline
ఇది విశాఖపట్నం–రాయ్‌పూర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 26) కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం క్యాంపస్ వరకూ సుమారు 3 కిలోమీటర్ల పొడవున ఆరులైన్ల (120 అడుగుల వెడల్పు)తో అప్రోచ్ రోడ్డు, ఇరువైపులా డ్రెయిన్ల నిర్మాణ పనుల చిత్రం. వాస్తవానికి ఇవి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలోనే ప్రారంభించాలి. రోడ్డు నిర్మాణానికి అవసరమైన 12 ఎకరాల భూమిని అప్పట్లోనే గుర్తించారు. భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. కేవలం ఈ పనులు ముందుకు సాగకుండా అడ్డుకోవాలనో లేదా మరే ఉద్దేశమో తెలియదు కానీ టీడీపీ నాయకులే అక్కడి భూయజమానులను రెచ్చగొట్టారు. 2023 డిసెంబర్‌లో పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. న్యాయవివాదంలో ఉన్న ఐదు ఎకరాల భూమి ఎన్‌హెచ్ 26కు ఆనుకొనే ఉండటం, అది ఇప్పట్లో తేలే పరిస్థితులు లేకపోవడంతో చివరకు టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో అలైన్‌మెంటే మార్చాల్సి వస్తోంది. టీడీపీ నాయకుల కుయుక్తుల ఫలితంగా ప్రత్యామ్నాయ భూసేకరణ అవసరమైంది.
Comments
Please login to add a commentAdd a comment