ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని పార్టీలు సహకరించాలి
శాసనమండలి స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీచేశామని, ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమైందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. నవంబర్ 11న మధ్యాహ్నం వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 12న నామినేషన్ల పరిశీలన, 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. శాసన మండలి ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం పార్వతీపురం, విజయనగరం ఆర్డీఓ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 28న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. ఓట్లలెక్కింపు డిసెంబర్ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి జరుగుతుందన్నారు. డిసెంబర్ 2 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణకు జేసీ ఎస్.సేతు మాధవన్ రిటర్నింగ్ అధికారిగా, విజయనగరం, పార్వతీపురం జిల్లా రెవెన్యూ అధికారులు ఏఆర్‌ఓలుగా వ్యవహరిస్తారని తెలి పారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, డీఎస్పీ పి.శ్రీనివాసరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐ.వి.పి.రాజు, నరసింహమూర్తి, సోములు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: శాసనమండలి స్థానిక సంస్థల నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు సహకరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.బి.ఆర్.అంబేడ్కర్ కోరారు. వచ్చేనెల 2వ తేదీ వరకు ఎన్నికల కోడ్ జిల్లాలో అమలులో ఉంటుందని స్పష్టంచేశారు. జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఎస్.సేతుమాధవన్‌తో కలిసి జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నియమావళి అమలుపై పర్యవేక్షణ, నిఘాకు ఎనిమిది బృందాలను నియమించామని కలెక్టర్ చెప్పారు. మరో ఎనిమిది వీడియోగ్రఫీ బృందాలను ఏర్పాటుచేశామన్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
శాసన మండలి ఉప ఎన్నికకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 2వ తేదీన ప్రచురించామని తెలిపారు. జిల్లాలో మొత్తం 727 మంది ఓటర్లు ఉన్నారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 325 మంది ఓటర్లలో పురుషులు 132 మంది, మహిళలు 193 మంది, విజయనగరం జిల్లాలోని 402 మంది ఓటర్లలో మహిళలు 239 మంది, పురుషులు 163 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను 8వ తేదీలోగా తెలియజేయవచ్చన్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఈ నెల 10న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని చెప్పారు.
ఉదయం 11 నుంచి నామినేషన్ల స్వీకరణ
కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
నామినేషన్ల స్వీకరణ
Comments
Please login to add a commentAdd a comment