రాష్ట్రస్థాయిలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు
ఆటోడ్రైవర్ కుమార్తెకు 150/150
ఉపాధ్యాయ ఉద్యోగ సాధనే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ
విజయనగరం అర్బన్: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో విజయనగరం విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ఎస్జీటీ విభాగంలో రాష్ట్రస్థాయిలో మొదటి మూడు ర్యాంకులను సొంతం చేసుకుని విద్యలనగరం పేరును ఇనుమడింపజేశారు. సుమారు 20 మంది విద్యార్థులు 145 మార్కులు పైబడి సాధించగా, 130–140 మధ్య మార్కులు పైబడి సాధించిన వారి సంఖ్య వందల్లో ఉంది. ఉపాధ్యాయ ఉద్యోగం అంటే తమకు ఎంత మక్కువో మార్కుల సాధనలో చూపించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా అక్టోబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన టెట్ ఫలితాలను ప్రభు త్వం సోమవారం విడుదల చేసింది.
జిల్లాలో ఈ పరీక్ష కోసం 11,530 మందు దరఖాస్తు చేసుకోగా దాదాపు 1500 మంది గైర్హాజరుతో పరీక్ష రాశారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) అర్హత పరీక్ష పేపర్–1, స్కూల్ అసిస్టెంట్ టీచర్ అర్హత పరీక్ష పేపర్–2, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్ –1బి, పేపర్–2బిగా పరీక్షలు జరిగాయి. ఎస్జీటీ విభాగంలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కోండ్రు అశ్విని 150/150 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. చదువులో కుమార్తె చూపుతున్న ప్రతిభను చూసి ఆటోడ్రైవర్ అయిన ఆమె తండ్రి శంకరరావు, తల్లి వెంకటలక్ష్మి మురిసిపోతున్నారు.
ఇదే విభాగంలో వీటి అగ్రహారానికి చెందిన దాసరి ధనలక్ష్మి 149.99/150, చీపురుపల్లికి చెందిన దేవ హారిక 149.46/150 మార్కులతో రాష్ట్రస్థాయిలో ద్వితీ య, తృతీయ స్థానాల్లో నిలిచారు. 145 పైబడి మార్కులు తెచ్చుకున్న వారిలో ఎన్.సుబ్బలక్ష్మి (147.08/150), ఎన్.శ్యామల (146.25/150), బి.కుమారి (145.07/150), ఎ.ప్రవల్లిక (145.07 /150), వి.చంద్రకళ (144.34/150), పి.రామక్ష్మి (143.51/150), జి.స్వాతి (141.13/150), ఎస్.హారిక (139.94/150), ఎ.వైష్ణవి (138.90/150) తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment