‘నాస్’ నిర్వహణపై శిక్షణ
రాజాం: విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే(నాస్) చేస్తున్నట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. పట్టణంలోని జీసీఎస్‌ఆర్ కళాశాలలో రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, మెరకముడిదాం, తెర్లాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాలకు చెందిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు బుధవారం ఒక రోజు శిక్షణ ఇచ్చారు. 62 మంది ఫీల్డ్ ఇన్విజిలేటర్లకు సర్వే అంశాలు వివరించారు. ప్రతీ రెండేళ్లకు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, నాస్ సెల్, ఎన్‌సీఈఆర్టీ, సీబీఎస్‌ఈ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ సంస్థలు సంయుక్తంగా సర్వేను చేస్తున్నట్టు వెల్లడించారు. 2021లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు పరీక్షించేందుకు సర్వే నిర్వహించగా, ఇప్పుడు 3, 6, 9 తరగతుల విద్యార్థులపై సర్వే చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించాలన్నారు. సర్వే వివరాలు గోప్యంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో చీపురుపల్లి డిప్యూటీ ఈఓ వెంకటరమణ, రాజాం ఎంఈఓలు ప్రవీణ్‌కుమార్, యాగాటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ మాణిక్యంనాయుడు
Comments
Please login to add a commentAdd a comment