వచ్చేనెల 15లోగా పనులు పూర్తిచేయాలి
విజయనగరం అర్బన్: పల్లె పండగ కార్యక్రమంలో మంజూరైన పనులన్నింటినీ డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. సీసీ రోడ్లు, కాటిల్ షెడ్స్ తదితర పనులపై వీడియో కాన్ఫరెన్స్లో మండలాల వారీగా బుధవారం సమీక్షించారు. పంచాయతీరాజ్ విభాగంలో మంజూరైన 2,203 పనుల్లో 1,407 పనులు గ్రౌండింగ్ అయ్యాయని, వీటిలో 61 పనులు పూర్తికాగా 6 పనులకు బిల్లులను సమర్పించారని తెలిపారు. గుర్ల తప్ప మిగిలిన అన్ని మండలాలు పనుల నిర్వహణలో వెనుకబడి ఉన్నాయన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాటిల్ షెడ్స్ జిల్లాలో 858 మంజూరు కాగా 386 గ్రౌండింగ్ అయ్యాయని, వీటిని త్వరగా పూర్తి చేసి బిల్లులను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డ్వామా పీడీ కళ్యాణచక్రవర్తి, పంచాయతీ రాజ్ ఎస్ఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment