పార్వతీపురం: ఎన్టీఆర్ భరోసా పింఛను పొందే వ్యక్తి మరణించిన సందర్భంలో వారి జీవిత భాగస్వామి (వితంతువు)కి కుటుంబ పోషణ కోసం తక్షణమే పింఛన్ పథకం కింద అర్హత మేరకు పింఛన్‌ను మంజూరు చేయబడుతుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారుడు 2024 నవంబర్ 1వ తేదీ లేదా ఆ తర్వాత మరణించినచో, వారి జీవిత భాగస్వామికి డిసెంబర్ 1వ తేదీ నుంచి పింఛను ప్రాసెస్ చేయబడుతుందన్నారు. ప్రతి నెలా పింఛన్లు పంపిణీ పూర్తయిన పిదప, పింఛను చెల్లించని పింఛనుదారుల రిమార్కును నమోదు చేయుటకు ప్రొవిజన్ మొబైల్ యాప్‌లో గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంటు వారికి ఇవ్వబడుతుందన్నారు. పురుష పెన్షనర్ డెత్ రిమార్క్ నమోదు చేసేటప్పుడు, జీవిత భాగస్వామి వివరాలు, ఆధార్, ఫోను నంబర్లు, పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ తీసుకొంటారన్నారు. పింఛన్‌కు సంబందించి ఎలాంటి సమస్యలైనా డీఆర్‌డీఏ పీడీ పరిశీలిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment