● అది ప్రభుత్వ హత్యే..
ఎన్నికల సమయంలో వలంటీర్లకు గుర్తింపు, గౌరవం కల్పిస్తామని, నెలకు రూ.10వేలు వేతనం చెల్లిస్తామని చెప్పిన టీడీపీ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు.. వలంటీర్ వ్యవస్థే లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు... దీనికి కలత చెందిన అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం మండలం, గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని నేలజర్తికి చెందిన కాకూరి వరలక్ష్మి ప్రాణాలు తీసుకుంది.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ ధ్వజమెత్తారు. ఆమెకు కన్నీటి నివాళులర్పిస్తూ విజయనగరం ఏపీ గ్రామ/వార్డు సచివాలయ వలంటీర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం, స్టేట్‌బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ సమీపంలో ఉన్న గాంధీవిగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వలంటీర్లకు ఇచ్చిన మాట నెలబెట్టుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కన్వీనర్ రవీంద్ర, కో కన్వీనర్లు ఆదిత్య, అచ్యుతకుమారి, బాలు, మణికంఠ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం పూల్‌బాగ్
Comments
Please login to add a commentAdd a comment