మూడు రోజుల్లో వినతులు పరిష్కరించాలి
విజయనగరం అర్బన్: జిల్లాలో భూముల రీ సర్వేపై ప్రజల నుంచి గ్రామ సభల ద్వారా వచ్చిన వినతులను మూడు రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్ట్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు భూ సర్వేకు సంబంధించి నిర్వహించిన గ్రామసభల సమాచారాన్ని తక్షణమే అందజేయాలని చెప్పారు. జిల్లాలోని తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో కలెక్టర్ శనివారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గ్రామ సభల్లో వచ్చిన వినతుల పరిష్కారంపై సమీక్షించారు. జిల్లాలో గతంలో భూసర్వే నిర్వహించిన గ్రామాల్లో 502 గ్రామసభలు నిర్వహించగా భూ సమస్యలపై 25,222 దరఖాస్తులు అందాయన్నారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 13,496, సర్వే విభాగానికి చెందినవి 11,726గా చూపిస్తున్నారని, వీటన్నింటినీ బుధవారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు స్వయంగా వినతుల పరిష్కారంపై పర్యవేక్షణ చేసి త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, సర్వే భూ రికార్డుల విభాగం ఏడీ రమణమూర్తి పాల్గొన్నారు.
ఫీజుల కోసం ఒత్తిడి చేస్తే చర్యలు తప్పవు
ఫీజుల చెల్లించలేదనే కారణంతో విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరించడం, తరగతులకు హాజరుకాకుండా అడ్డుకోవడం, ప్రాక్టికల్స్‌కు నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడే ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్య ప్రతినిధులతో కలెక్టర్ శనివారం తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాలకే జమచేస్తుందన్నారు.
తహసీల్దార్, సర్వేయర్లకు కలెక్టర్ ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment