No Headline
విజయనగరం ఫోర్ట్: వ్యవసాయ చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్ కమిటీకి వచ్చే ఆదాయం తగ్గింది. దీని వల్ల మార్కెట్ కమిటీల ఆదాయానికి గండి పడింది. వ్యవసాయ ఉత్పత్తులకు విఽధించే మార్కెట్ ఫీజు ద్వారా మార్కెట్ కమిటీలకు ఆదాయం వస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ఫీజును వ్యవసాయ చెక్‌పోస్టు సిబ్బంది వసూలు చేస్తారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్ కమిటీలు ఫీజు వసూలు చేస్తారు. అయితే ఈ ఏడాది చెక్‌పోస్టుల ద్వారా వచ్చిన ఆదాయం తగ్గింది.
జిల్లాలో 11 వ్యవసాయ చెక్
పోస్టులు
జిల్లాలో 11 చెక్‌పోస్టులు ఉన్నాయి. విజయనగరంలో చెక్‌పోస్టు – 1, చెక్‌పోస్టు – 2 ఉన్నాయి. బొబ్బిలి, టెక్కలివలస, రామభద్రపురం,గొట్లాం, గరివిడి, కొత్తవలస, నాతవలస, గర్భాం, డోలపేట, రాజాంలోని చీపురపల్లి రోడ్డులో వ్యవసాయ చెక్‌పోస్టులు ఉన్నాయి.
తగ్గిన ఆదాయం రూ.66
లక్షలు
చెక్‌పోస్టుల ద్వారా మార్కెట్ కమిటీలకు వచ్చిన ఆదాయం రూ.66 లక్షలు తగ్గింది. 2023 – 24లో చెక్‌పోస్టుల రూ.4.98 కోట్లు ఆదాయం సమకూరింది. 2024 – 25లో చెక్‌పోస్టుల ద్వారా అక్టోబర్ నాటికి ఆదాయ లక్ష్యం రూ.2.88 కోట్లు కాగా.. వసూలు చేసింది రూ.2.22 కోట్లు మాత్రమే.
ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలు
184 రకాల నోటిఫైడ్ వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం మార్కెట్ ఫీజు వసూలు చేస్తారు. వరి, మొక్కజొన్న, పత్తి, నువ్వులు, పెసలు, మినుములు, గోగునార, బెల్లం, అరటి, వేరుశనగ, మామిడి, జీడిమామిడి తదితర ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు వసూలు చేస్తారు.
ఆదాయం వచ్చే అవకాశం ఉంది..
జీడిపప్పు, కర్రలపై గతేడాది మార్కెట్ ఫీజు అధికంగా వచ్చింది. ఈ ఏడాది జీడిపప్పు ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావడానికి ఇంకా సమయం ఉంది. ఆదాయం శతశాతం వచ్చే అవకాశం ఉంది.
– రవికిరణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ
Comments
Please login to add a commentAdd a comment