ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
మహారాణిపేట(విశాఖ)/విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ప్రతిపాదిత ఓటర్ల జాబితాను శనివారం జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నెల 6వ తేదీ వరకు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 17,404 మంది దరఖాస్తు చేశారు. ఆన్‌లైన్ ద్వారా 4,802 మంది, ఆఫ్‌లైన్ ద్వారా 12,602 దరఖాస్తు చేశారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, మొత్తం 15,287 మందికి ఓటు హక్కు కల్పించారు. వీరిలో పురుషులు 9,638 మంది, సీ్త్రలు 5,649 మంది ఉన్నారు. ఈ ముసాయిదాపై డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ప్రకటించిన ముసాయిదా జాబితాలో మార్పులు, చేర్పులకు వచ్చేనెల 9వ తేదీ వరకు ఠీఠీఠీ.ఛి్ఛ్చౌ ుఽఛీజిట్చ. ుఽజీఛి.జీ ుఽ అనే వెబ్‌సైట్‌లో కాని, సంబంధిత ఓటర్ల నమోదు అధికారికిగాని, సహాయ ఓటరు నమోదు అధికారులు లేదా ప్రత్యేక అధికారులకు గాని దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రచురించిన ముసాయిదా జాబితాలో అర్హులైన వారి పేరు నమోదు కాకపోతే కనీసం మూడేళ్ల బోధన అనుభవం గల ధ్రువీకరణ పత్రంతో పాటు అన్ని డాక్యుమెంట్లతో ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యంతరాలను ఫారం–7 ద్వారా తెలియజేయాలి. జాబితాలో ఓటరు వివరాల మార్పుల కోసం ఫారం–8లో దరఖాస్తు చేయాలి. అభ్యంతరాల స్వీకరణపై విజయనగరం కలెక్టరేట్‌లో కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గడువులోగా అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment