జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి
పార్వతీపురం టౌన్: జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీనివ్వాలని ఏపీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షుడు కిశోర్ కోరారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం బెలగాం రైతుబజార్ సమీపంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తామన్నారు. సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు, ఆశపు జయంత్కుమార్, సాలాపు అనంతరావు, జి.గోపాల్, పాణిగ్రాహి సత్యనారాయణ, ఆర్వీఎస్ కుమార్, ఆర్.సుధాకర్, కోమటి శ్రీనివాసరావు, బి.రాజశేఖర్, ఉమా మహేశ్వరరావు, భగవాన్ దాస్ ప్రశాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఏపీయూడబ్ల్యూజే డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment