ఉపాధ్యాయుడి మృతిపై ఆరా
గజపతినగరం: గజపతినగరం మండలంలోని మరుపల్లి వద్ద ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్‌ఎల్‌డీపీ శిక్షణకు హాజరైన హెచ్‌ఎం మృతిపై విశాఖపట్నం జోన్–1 ఆర్‌జేడీ బి.విజయభాస్కర్ ఆరా తీశారు. ఎంఈఓలతో కలిసి శిక్షణ కేంద్రాన్ని గురువారం సందర్శించారు. కోర్సు డైరెక్టర్, ఎంఈఓ–2 సాయిచక్రధర్‌ను వివరా లు అడిగి తెలుసుకున్నారు. 150 కిలోమీటర్ల పైబడి దూరం నుంచి వస్తున్న 52 మంది హెచ్‌ఎంలు స్థానికంగానే ఉంటున్నట్టు ఆయన తెలిపారు. మృతుడు సిరిపురపు శ్రీనివాసరావు ఉదయం ఏడున్నర గంటలకు అస్వస్థతకు గురికావడంతో వెంటనే గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించామని, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారన్నారు. మృత దేహాన్ని ఆయన స్వస్థలం పాలకొండ పట్టణానికి తరలించినట్టు చెప్పారు.
శిక్షణ రద్దు
ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఎఫ్‌ఎల్‌ఎన్, ఎస్‌ఎల్‌డీపీ శిక్షణలు పూర్తిగా నాన్‌రెసిడెన్షియల్ పద్ధతిలోనే జరుగుతాయని, సాయంత్రం 5 గంటల వరకే తరగతులు నిర్వహిస్తామని ఆర్‌జేడీ తెలిపారు. ప్రస్తుతం మరుపల్లిలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment