విజయనగరం
శుక్రవారం శ్రీ 29 శ్రీ నవంబర్ శ్రీ 2024
క్రీడాస్ఫూర్తితో మెరుగైన సేవలందించాలి
జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మూడురోజుల పాటు సాగే వార్షిక జిల్లా పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్–2024ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి గురువారం ప్రారంభించారు. – 8లో...
● బోధనేతర పనులతో ప్రాణ సంకటం
● యాప్‌ల అప్‌లోడ్ నుంచి మెగా
పేరెంట్ టీచర్ సమావేశం వరకు ఒత్తిడికి గురవుతున్న ఉపాధ్యాయులు
● 299 మంది హెచ్‌ఎంలకు, 1,600 ప్రైమరీ టీచర్లకు రెసిడెన్షియల్ ట్రైనింగ్
● శిక్షణ తరగతులకు నిషిద్ధ సెలవుల నిబంధన
● తాజాగా శిక్షణ తరగతుల్లో
గుండెపోటుతో హెచ్‌ఎం మృతి
● ఆందోళనకు దిగిన ఉపాధ్యాయలోకం
ఉపాధ్యాయులు చెబుతున్న
ఒత్తిడి పెంచే పనులివే...
●ఇన్‌ఫర్మేషన్ ఆప్‌లోడ్ అర్జెంట్ అంటూ యాప్‌ల ద్వారా చేయించే పనులు మానసిక ఒత్తిడితో పాటు పాఠాలు చెప్పనీయకుండా ఇబ్బంది పెడుతున్నా యి.
●అకడమిక్ కార్యక్రమంతో పాటు ఇతర కార్యక్రమాల పేరుతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సమయాన్ని హరించడం.
●మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యాచరణ ప్రక్రియ పేరుతో నెల రోజుల ముందు నుంచి పాఠశాల నిర్వహణ, ఉపాధ్యాయుల అకడమిక్ సమయాన్ని వృథా చేయించడం.
●విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మెగా పేరెంట్ టీచ ర్ మీటింగ్ కార్యాచరణ ప్రక్రియ కోసం దాదాపు 50 పేజీల నివేదికను తయారుచేయమనడం.
●పరీక్షల్లో విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో నమోదుకు తగినంత సమయం ఇవ్వకపోడం.
●బయోమెట్రిక్ హాజరు వేయడానికి కనీసం 10 నిమిషాలు గ్రేస్ పీరియడ్ ఇవ్వకపోవడం.
●ఉపాధ్యాయుల కుటుంబ జీవనానికి సంబంధించిన పీఎఫ్, ఏపీటీఎల్‌ఐ లోన్స్ విడుదల వంటి ఆర్థిక కపరమైన అంశాలు పరిష్కరించకపోవడం.
విజయనగరం అర్బన్:
విద్యారంగంలో బోధన కీలకమైనది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ప్రశాంతంగా పాఠ్యాంశ బోధన చేసినప్పుడే విద్యాలక్ష్యాలు నెరవేరుతాయి. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలు పెంపొందుతాయి. పాఠ్యాంశాలపై పట్టు సాధించగలరు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రభుత్వం బోధనేతర పనులను అప్పగించి బోధనకు దూరం చేస్తోందంటూ ఉపాధ్యాయలోకం ఆందోళన వ్యక్తంచేస్తోంది. పాఠశాలల నిర్వహణపై పదుల సంఖ్యలోని యాప్‌లలో వివిధ సమాచారాన్ని అప్‌లోడ్ చేయడం నుంచి మెగా పేరెంట్ టీచర్ సమావేశం పేరుతో 50 పేజీల కార్యాచరణ ప్రణాళిక తయారీ వరకు ఊపిరిసలపని బోధనేతర పనులను అప్పగించడంపై మండిపడుతోంది. సరిగా పనిచేయని గురువులకు మెమోలు తప్పవన్న హెచ్చరికలతో ఒత్తిడి అధికమవుతోందంటూ ఆందోళన వ్యక్తంచేస్తోంది. అదే ఒత్తిడితో గజపతినగరంలోని మరుపల్లిలో ప్రధానోపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ తరగతులకు గురువారం హాజరైన భామిని మండలం నేరడి ఎంపీయూపీ పాఠశాల హెచ్‌ఎం ఎస్.శ్రీనివాసరావు గుండెపోటుతో మృతిచెందాడని ఆరోపించింది. ఈ ఘటనపై శిక్షణ కేంద్రం వద్దే ఆందోళనకు దిగింది.
శిక్షణ ఇలా..
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో తొలుత ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 299 మంది ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధాపాధ్యాయులకు స్కూల్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఎల్‌డీపీ) పేరుతో రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాన్ని గజపతినగరం మండలంలోని మరుపల్లిలోగత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నారు. శిక్షణకు హాజరైనవారిలో 54 సంవత్సరాల పైబడిన ప్రధానోపాధ్యాయులే అధిక
డీఈఓ కార్యాలయం వద్ద ఆందోళన
శిక్షణ కేంద్రం వద్ద ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు మృతితో ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం విజయనగరం డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ నినదించారు. ఇటీవల అగిరిపల్లి(నూజివీడు) రెసిడెన్షియల్ ట్రైనింగ్ కేంద్రంలో ఉపాధ్యాయుడు మరణించిన తరువాత ఈ శిక్షణను నిలిపేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
బోధనేతర పనులతో
మానసిక ఒత్తిడి
బోధనేతర పనుల వల్ల విద్యార్థులకు ఉపాధ్యాయు లు సరిగా పాఠ్యాంశ బోధన చేయలేకపోతున్నారు. మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు తోడయ్యాయి. ఉపాధ్యాయ వర్గం భయాందోళన చెందుతోంది. ఏడాదిలో కనీసం 100 రోజుల వరకు పాఠశాలల్లో వివిధ రకాల దినోత్సవాలు నిర్వహించాల్సి వస్తోంది. వీటిలో జాతీయ స్థాయిలోని ప్రాధాన్యత కలిగినవి దినోత్సవాలు మాత్రమే నిర్వహిస్తే కొంత మేరకు పని ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడికి గురిచేసేలా శిక్షణ తరగతులు నిర్వహించవద్దు. – డి.శ్రీనివాసరావు,
జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ
నిర్బంధ శిక్షణ వద్దు
అత్యాధునిక సాంకేతిక యుగంలో కూడా వారం రోజులపాటు కుటుంబాల కు దూరంగా ఉంచి రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం మానసిక ఆందోళనకు గురిచేస్తోంది. అనారోగ్య కారణాలకు కూడా సెలవు ఇవ్వకుండా శిక్షణకు హాజరు కావాలని నిర్బంధం చేయడం సరికా దు. ఇప్పటికే బోధనేతర పని భారం పెంచి అనేక యాప్‌ల నిర్వహణ, రకరకాల పనులతో ఒత్తిడికి గురవుతున్నాం. స్కూల్ లీడర్ షిప్ ట్రైనింగ్, ఫౌండేషన్ అంశాలలో రెసిడెన్షియల్ పద్ధతిలో కాకుండా శిక్షణ ఇవ్వాలి.
– ఇజ్జిరోతు రామినాయుడు, రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం
మంది ఉన్నారు. అప్పటికే పాఠశాల నిర్వహణ బాధ్యతల ఒత్తిడితో ఉన్న ప్రధానోపాధ్యాయులకు రెసిడెన్షియల్ శిక్షణ మరింత ఒత్తిడిని పెంచినట్టు ఆరోపణ. అలాగే, 1, 2 తరగతులకు బోధిస్తున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయలకు డెంకాడ మండలం మోదవలసలో ఎఫ్‌ఎల్‌ఎన్ పేరుతో రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు సాగుతున్నాయి. హెచ్‌ఎం మృతితో శిక్షణ తరగతులను రద్దుచేసినట్టు విద్యాశాఖ ప్రకటించింది.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment