జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం
● బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే ● పూలే దంపతుల ఆశయాలకు అనుగుణంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలన ● బడుగు బలహీన వర్గాల అణిచివేతే నేటి ప్రభుత్వతీరు ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం రూరల్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి జ్వోతిరావు పూలే ఆశయాలు అందరికీ ఆదర్శనీయమైనవని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పూలే వర్ధంతిని జెడ్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అట్టడుగున ఉన్న వారు సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఆశించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని అన్నారు. సావిత్రిబాయ్‌పూలే మహిళలకు విద్య ఎంతో అవసరంమని భావించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన ఆశయాన్ని కొనసాగించి నేటి ఎంతో మంది విద్యావంతులైన మహిళలకు ఆదర్శప్రాయులయ్యారన్నారు. పూలే దంపతుల ఆశయాలను నిలబెట్టే ప్రభుత్వాలు రావాలని ఆకాంక్షించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూలే, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చి బడుగుబలహీన వర్గాల ఆర్థికాభివృద్ధికి కృషిచేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సకల సదుపాయాల కల్పనతోపాటు, విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చి కార్పొరేట్‌ను తలదన్నేలా విద్యాసంస్కరణలు అమలుచేసిందని గుర్తుచేశారు. నేటి కూటమి ప్రభుత్వం రాజ్యాంగం కల్పించే హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోంద ని విమర్శించారు. పీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విదల్చకుండా విద్యార్థులకు టీసీలు ఇచ్చేలా కూటమి పాలన ఉండటం దౌర్భాగ్యమన్నారు. హామీలు అమలుచేయడంలేదని ప్రశ్నించేవారిపై పోలీసులతో కేసులు పెట్టించడం విచారకరమన్నా రు. ఇది ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధమని, నిరం
కుశ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే తప్ప చేతల్లో ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. రైతన్నకు పెట్టుబడి సాయం అందిందచలేదని, కనీసం వారు పండించిన పంటను కూడా సక్రమంగా కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. ఇప్పటికై నా మహానుభావుల ఆశయాల ను ఆదర్శంగా తీసుకొని పాలన సాగించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ ఉద్యోగులు, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు జయంత్, డీసీసీబీ మాజీ చైర్మన్ సూర్యనారాయణ రాజు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment