గోనె సంచుల సరఫరా
విజయనగరం ఫోర్ట్: ధాన్యం సేకరణకు గోనె సంచులు లేక రైతులు ఇబ్బంది పడు తున్న అంశంపై ‘ధాన్యం సేకరణకు గోనె సంచులు కరువు’ అనే శీర్షికన ‘సాక్షి’లో గురువారం ప్రచురించిన కథనానికి సివిల్ సప్‌లై, పీఏసీఎస్ అధికారులు స్పందించారు.రైతు సేవా కేంద్రాల(ఆర్‌బీకే)కు ధాన్యం సేకరణకు అవరసమైన గోనె సంచులు సరఫరా చేశారు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ రాణి
విజయనగరం ఫోర్ట్: లింగ నిర్ధారణ వెల్లడించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.రాణి హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం గర్భస్థ పిండ పక్రియ చట్టం–1994 అమలుపై నియమించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడా రు. గర్భస్థ పిండ పరిస్థితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షలకు వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్ధారణకు ఉపయోగిస్తే క్రిమిన ల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారు లు విధిగా స్కానింగ్ సెంటర్లను పర్యవేక్షించా లని ఆదేశించారు. అసిస్టెంట్ రీ ప్రొడక్షన్ టెక్నా లజీ రేగులేషన్ (ఏఆర్‌టీ) చట్టం–2021 ప్రకా రం జిల్లాలో పెర్టిలిటీ కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ అచ్చుతకుమారి, ఉప వైద్య ఆరోగ్యశా ఖాధికారి డాక్టర్ సూర్యనారాయణ, గైనికాలజిస్టు డాక్టర్ సుధారాణి, ఎన్‌సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఎపిడిమాలజిస్టు డాక్టర్ వెంకటేష్, డెమో చిన్నతల్లి పాల్గొన్నారు.
పూలే ఆశయాలు గొప్పవి
విజయనగరం అర్బన్: మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలు గొప్పవని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. పూలే వర్ధంతిని పూలే కూడలి వద్ద గురువారం నిర్వహించారు. తొలుత జ్యోతిరావుపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు, కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిబా పూలే జాతికి చేసిన సేవలను కొనియాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, డీబీసీడబ్ల్యూ పెంటోజీరావు, డీపీఆర్‌ఓ డి.రమేష్, కలెక్టరేట్ ఏఓ దేవ్ ప్రసాద్, ఏబీసీడబ్ల్యూఓలు యశోధనరావు, రాజులమ్మ, శ్యామల, బీసీ వసతి గృహ సంక్షేమాధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రుణ వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ
విజయనగరం అర్బన్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో రుణ వసూళ్లపై బ్యాంకు మేనేజర్లు, సూపర్‌వైజర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని బ్యాంకు పర్సన్ ఇన్‌చార్జి, జేసీ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. వర్చువల్‌గా గురువారం నిర్వహించిన డీసీసీబీ జనరల్ బాడీ సమావేశంలో జేసీతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పీఐసీ కమిటీ సభ్యులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడు తూ బ్యాంకులో వివిధ దశల్లో అవకతవకలకు తావులేని విధంగా నియంత్రణలు ఉండాలని స్పష్టం చేశారు. బ్యాంకు ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఒక స్టాట్యుటరీ ఆడిటర్‌ను నియమించేందుకు రిజర్వుబ్యాంకును అనుమతి కోరాలని తీర్మానించారు. జిల్లాలోని 60 పీఏసీఎస్‌లలో ఆన్‌లైన్ బ్యాంకు సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఈఓ సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. సమావేశంలో జిల్లా సహకార అధికారి పి.రమేష్, నాబార్డు డీడీఎం టి.నాగార్జున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment