మానసాదేవిని దర్శించుకున్న సినీనటుడు సుమన్
చీపురుపల్లి: మండలంలోని రామలింగాపురం పరిసరాల్లో స్వయంభూగా వెలిసిన మానసాదేవి నాగశక్తి అమ్మవారిని సినీ నటుడు సుమన్ శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ధర్మకర్త పిన్నింటి రమణ దంపతులు, ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సుమన్... సన్నిధిలో కాసేపు ధ్యానం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన మానసాదేవి అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టమన్నారు. అరకులో జరిగే సినీ షూటింగ్‌లో పాల్గొని అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో పిన్నింటి శ్రీను, బెల్లాన త్రినాథరావు, సారిక మోహన్, ఇప్పిలి గోవింద, ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులపై ఎందుకంత కోపం..
● ఏరి కోరి తెచ్చుకున్నందుకేనా....
● నాలుగో తేదీ దాటినా జీతాలు ఇవ్వరా
● జిల్లా, రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు?
● ఉపాధ్యాయ సంఘ వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్‌లు
● ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్న గురువులు
చీపురుపల్లి: అయ్యా.. జిల్లా, రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు..? నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారేంటి సార్... ఈ రోజు నాలుగో తేదీ.. ఇంతవరకు జీతాలు పడలేదు. సంక్రాంతి పండగ ఉన్నా జీతాలు వేయలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏరికోరి తెచ్చుకున్నందుకు ఇది గిఫ్టా... మీరంతా ఏం చేస్తున్నారు..? అన్ని డిపార్ట్‌మెంట్లకు జీతాలు జమచేసి ఉపాధ్యాయులపై మాత్రమే ఎందుకంత కోపం.. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుంది... అంటూ ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు వాయిస్ మెసేజ్‌ను వాట్సాప్ గ్రూపుల్లో పంపడంతో జిల్లాలో వైరల్‌గా మారింది. అక్కడితో ఆగకుండా సదురు ఉపాఽ ద్యాయ సంఘ నాయకుడు ఓ జనసేన నాయకుడికి ఫోన్ చేసి కోరి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకేనా మాపై కక్ష కట్టారా అంటూ, గురువులను గౌరవించాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చెప్పారని ఇదేనా గౌరవం అంటూ నిలదీసిన వాయిస్ మెసేజ్ కూడా ఉపాధ్యాయ సంఘ వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేసింది.
ఉపాధ్యాయుల్లో పెరుగుతున్న అసంతృప్తి
నాలుగో తేదీ దాటుతున్నా జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయుల్లో అసహనం పెరుగుతోంది. సంఘ నాయకుడు పెట్టిన వాయిస్ మెసేజ్ ఆవేదన అందరిలోనూ ఉందని, పండ గ పూట సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఎలా అంటూ ఉపాధ్యాయులు మదనపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment