సందడిగా గురుకులం క్రీడల ముగింపు
● ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిన అన్నవరం విద్యార్థులు
నెల్లిమర్ల:
ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల జోన్–1 క్రీడాపోటీలు నెల్లిమర్లలోని ఎంజేపీ ఎపి బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం ముగిశాయి. రెండ్రోజుల పాటు కొనసాగిన పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 14 పాఠశాలల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో అన్నవరం గురుకుల పాఠశాల విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ కై వశం చేసుకున్నారు. విజేతలకు కన్వీనర్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేబీబీ రావు బహుమతులు ప్రదానం చేశారు. రసవత్తరంగా సాగిన ఈ పోటీల్లో వ్యక్తిగత విభాగంలో కె.భారతి చాంపియన్ షిప్ సాధించింది. కబడ్డీ పోటీల్లో టెక్కలి గురుకులం జట్టు ప్రథమస్థానంలో నిలవగా సాలూరు జట్టు ద్వితీయ స్థానం కై వసం చేసుకుంది. ఖోఖోలో పలాస, ఆమదాలవలస మొదటి రెండు స్థానాలలో నిలిచాయి. బ్యాడ్మింటన్‌లో తానాం, పార్వతీపురం ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. హ్యాండ్‌బాల్‌లో తానాం, నెల్లిమర్ల జట్లు వరుస స్థానాలలో నిలిచాయి. ఈ పోటీలను పీఈటీలు కామేశ్వరి, సూర్యరావు, మోహన్, ఆనంద్, సీత, దమయంతి పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment