బొబ్బిలి: స్థానిక ఏపీజీవీబీ శాఖ లాకర్‌లో దాచుకున్న 30 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో బొబ్బిలి నాయుడు కాలనీకి చెందిన ఉపాధ్యాయుడు ఆర్నిపల్లి నాగభూషణరావు, తులసి దంపతులు లబోదిబోన్నారు. బ్యాంకు జీఎం, ఆర్‌ఎం, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 తులాల బరువున్న 19 ఆభరణాలను గత 14 ఏళ్లుగా వినియోగిస్తున్న ఏపీజీవీబీ బ్యాంకు లాకర్‌లో భద్రపరిచాం. ఇటీవల వాటిని పరిశీలించేందుకు వెళ్లగా అందులో ఒక్క వస్తువు కూడా కనిపించలేదు. దీనిపై బ్యాంకు మేనేజర్ అప్పలనాయుడును ప్రశ్నించాం. బ్యాంకులోని లాకర్ స్పేస్‌ను మాత్రమే ఇస్తామని, అందులో భద్రపరిచిన ఏ వస్తువైనా మీదే బాధ్యతని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణలో బయటపడుతుందని సమాధానం ఇచ్చారు. దీంతో ఏపీజీవీబీ జనరల్ మేనేజర్, రీజనల్‌మేనేజర్‌తో పాటు బొబ్బిలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నాగభూషణం, తులసి చెప్పారు. ఇదే విషయంపై బ్యాంకు మేనేజర్ నాయుడు మాట్లాడుతూ వారు వినియోగించుకున్న లాకర్‌లో వస్తువులు పోయాయని ఫిర్యాదుచేశారని, ఇది ఎలా జరిగిందో తెలియదన్నారు. వారే మరో సారి చెక్ చేసుకోవాలని చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతామని సీఐ కె.సతీష్‌కుమార్ తెలిపారు. నాగభూషణరావు స్వగ్రామం రామభద్రపురం మండలంలోని నాయుడువలస కాగా, ఉపాధ్యాయ వృత్తి రీత్యా బొబ్బిలిలో నివసిస్తున్నారు.
ఏపీజీవీబీ జనరల్ మేనేజర్,
ఆర్‌ఎం, పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు
Comments
Please login to add a commentAdd a comment