● కలెక్టర్ బీఆర్.అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: మాతాశిశు మరణాలు సంభవిస్తే, సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వైద్యాధికారులను హెచ్చరించారు. గడిచిన ఐదునెలల్లో జిల్లాలో జరిగిన మాతాశిశు మరణాలపై కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం సాయత్రం వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 మాతామరణాలు, ఆరు శిశు మరణాలపై కేసుల వారీగా వివరాలను తెలుసుకున్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి యంత్రాంగం పనిచేస్తోందని చెప్పారు. అయినప్పటికీ మరణాలు సంభవించడం బాధాకరమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిని చైతన్య పరచడం ద్వారా గర్భిణులు, శిశువులపై పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సక్రమంగా తీసుకునే విధంగా, ఇస్తున్న మందులు సక్రమంగా వాడేలా చూడాలన్నారు. దీనికోసం వైద్యారోగ్య శాఖ, సీ్త్ర, శిశు సంక్షేమశాఖలు తమ కిందిస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. గర్భిణుల్లో హిమోగ్లోబిన్ శాతం పెరిగేలా చూడాలని చెప్పారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో తరచూ తనిఖీలు నిర్హించారు. చిన్న వయస్సులో గర్భాలను నిరోధించేందుకు, అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి, డీఐఓ అచ్యుతకుమారి, ఐసీడీఎస్ ఇన్‌చార్జ్ పీడీ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment