రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు పోలీస్, రవాణా, జాతీయ రహదారుల సంస్థతో కలిసి పకడ్బందీ చర్యలు చేపడతామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటికి గల కారణాలను శాసీ్త్రయంగా అంచనావేసి నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. గుర్తుతెలియని వాహనాలు ఢీకొన్న ఘటనల్లో గాయపడిన, మరణించిన వారికి సహాయం అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ అంబేడ్కర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల తీరును పోలీస్ అధికారులు వివరించారు. జాతీయ రహదారులపై తగినంత వెలుతురు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతినెలా సగటున ఆరు నుంచి ఏడు గుర్తు తెలియని వాహనం ఢీకొన్న కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ సభ్యుడు మజ్జి అప్పారావుకు చెందిన రోడ్ సేఫ్టీ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలపై రూపొందించిన బ్యానర్‌ను, రోడ్డుభద్రతపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన ప్లకార్డులను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓలు, డీఎస్పీలు, డివిజనల్ అధికారులు రామ్మో హనరావు, సత్యవాణి, కీర్తి, శ్రీనివాసరావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి గోకులాల ప్రారంభం
జిల్లాలో నిర్మాణం పూర్తయిన గోకులాలను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంపీడీఓలను ఆదేశించారు. గోకులాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, డ్వామా పీడీ శారదాదేవి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్, డీపీఓ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment