కంటి చూపుపై ప్రభావం
ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలకు వినియోగిస్తే కంటిచూపుపై ప్రభావం పడుతుంది. రెటీనా పొర దెబ్బతినే అవకాశముంది. కళ్లు పొడిబారడం వల్ల ఎరుపెక్కుతాయి. నిద్రలేమి వల్ల తలనొప్పి కూడా వస్తుంది.
రామకృష్ణ, నేత్ర వైద్య నిపుణుడు,
పాలకొండ ఏరియా ఆస్పత్రి
అతి వినియోగం అనర్థం
అతిగా మొబైల్ వినియోగం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. ఇది వ్యసనంగా మారితే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఒంటరితనం అలవడుతుంది. కుటుంబసభ్యుల అనురాగాలకు దూరమవుతారు. ప్రస్తుతం పరీక్షల వేళ చదువులపై దృష్టిసారించాలి. రాత్రి సమయాల్లో నిద్రలేకపోతే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున యువత జాగ్రత్త వహించాలి.
సాయిచరణ్, వైద్యాధికారి, మర్రిపాడు పీహెచ్‌సీ
●
Comments
Please login to add a commentAdd a comment