చూడచక్కని సోలార్ బండి
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి అవంతీ సెయింట్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సోలార్‌తో నడిచే ఆటోను రూపొందించి అందరి దృష్టినీ ఆకర్షించారు. కళాశాలలో విశాఖపట్టణానికి చెందిన సూర్యరెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న బీటెక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాలకు చెందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు సోలార్‌తో నడిచే వెహికల్‌ను తయారు చేశారు. కాలుష్యరహిత ఈ వాహనానికి భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందన్నారు. వాహనం నడుస్తున్నప్పుడే ఆటోమేటిక్‌గా చార్జింగ్ అవుతుందని తెలిపారు. ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ సిస్టం, ఆటో కట్ ఆఫ్ చార్జర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్టింగ్ అలారమ్, బ్యాలెన్సెడ్ రియల్‌షాక్ అబ్జర్వన్స్, లోడ్ గేర్ సిస్టం వంటి అధునాతన వ్యవస్థలు ఈ వాహనం ప్రత్యేకతలని కళాశాల ప్రిన్సిపాల్ డా.వి.జాషువా జయప్రసాద్ తెలిపారు. ఈ వాహనం 48 ఓల్ట్ సిస్టమ్‌తో తయారైందని, 300 కిలోల లోడ్‌తో 80 నుంచి 100 కిలోమీటర్ల దూరం వరకు నిశ్చింతగా ప్రయాణించవచ్చన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రన్సిపాల్ బి.వెంకటరమణ, ఏఓ జి.అనిల్‌కుమార్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అవంతి సెయింట్ థెరిసా విద్యార్థుల ప్రతిభ
Comments
Please login to add a commentAdd a comment