గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
● జేసీ ఎస్.సేతుమాధవన్
విజయనగరం అర్బన్: గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తెలిపారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను ఆయన శనివారం సాయంత్రం పరిశీలించారు. పతాక ఆవిష్కరణ వేదిక, స్టాల్స్, శకటాల మార్గం, వీఐపీ గ్యాలరీ, ఇతర ఏర్పాట్లను తనిఖీ చేశారు. మార్పులు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీవో డీ.కీర్తి, తహసీల్దార్ కూర్మనాథరావు, ఇతర అధికారులు జేసీ వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment