ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
పాన్‌గల్/వీపనగండ్ల: రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాన్‌గల్, వీపనగండ్ల మండల కేంద్రాలతో పాటు బుసిరెడ్డిపల్లి, చింతకుంట, కొత్తపేట, అన్నారం, గోప్లాపూర్, గోవర్ధనగిరి, సంగినేనిపల్లి, కల్వరాల, పుల్గర్‌చర్ల గ్రామాల్లో మంగళవారం వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రైతులు విక్రయించిన ధాన్యానికి వెంటనే రశీదులు అందజేయాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తరుగు పేరుతో అధిక వడ్లను రైతుల నుంచి తీసుకుంటే సహించమన్నారు. గోవర్ధనగిరిలో రైతుల సౌకర్యార్థం విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. వీపనగండ్లలో సింగిల్‌విండో కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బెక్కెం రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. పుల్గర్‌చర్లలో ఆరోగ్య ఉపకేంద్రం, పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వల్లాభాపురంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. చింతకుంటలో మాజీ సర్పంచ్ అనూష భర్త ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా.. బాధిత కుటంబాన్ని మంత్రి జూపల్లి పరామర్శించారు. రాయినిపల్లికి చెందిన పుట్ట బాలస్వామికి రూ.60 వేలు, కొంకల విష్ణుకు రూ.19 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, డీఆర్డీఓ ఉమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమూర్తి, ఏపీఓ బిచ్చన్న, ఏఓ డాకేశ్వర్‌గౌడ్, వెలుగు సీసీ వీరయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ ఉస్మాన్, బీరయ్య యాదవ్, కృష్ణయ్య, నారాయణరెడ్డి, బాల్‌రెడ్డి, గోపి, వెంకటేష్, చిట్టెమ్మ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment