రూ.16 లక్షలతో మైదానం అభివృద్ధి
ఆత్మకూర్: మున్సిపాలిటీలోని వార్డులు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని, పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి వారికి అనుగుణంగా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని చైర్పర్సన్ గాయత్రిరవికుమార్ అన్నారు. మంగళవారం స్థానిక జాతర మైదానంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన వాకింగ్, రన్నింగ్ ట్రాక్, పార్కులను పరిశీలించారు. పట్టణ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని జాతర మైదానంలో వాకింగ్, రన్నింగ్ ట్రాక్‌లను నిర్మించామని, ఇక్కడ వ్యాయామం చేసేవారు ఆహ్లదంగా ఉండేందుకు రెండు పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో ఈ ఐదేళ్ల కాలంలో రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, గాంధీచౌక్‌లో రూ.నాలుగు కోట్లతో సీసీరోడ్ల నిర్మాణ పనులు పూర్తికాగా సమీకృత మార్కెట్, వైకుంఠధామం నిర్మాణాలు పూర్తి కావల్సి ఉందని తెలిపారు. పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని చైర్పర్సన్ గాయత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment