చట్టానికి లోబడి నడుచుకోవాలి
వనపర్తిటౌన్: ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయ సేవాధికార సంస్థ పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తుందన్నారు. బాధితులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ సేవలను పొందవచ్చన్నారు. గృహహింస చట్టం మహిళలకు మేలు చేకూరుస్తుందన్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధింపులకు గురైతే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరమన్నారు. ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లు వాహనాలను నడిపితే తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో న్యాయవాది డేగల కృష్ణయ్య, జీహెచ్‌ఎం గాయత్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment