ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి : ఎస్పీ
వనపర్తి: వర్టికల్ సిబ్బంది తమ పనితీరును మెరుగుపర్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేషన్ రైటర్లు, రిసెప్షన్స్, కోర్టు కానిస్టేబుల్స్, సీసీటీఎన్‌ఎస్ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ క్రైం కేసులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వారు ఇచ్చే పిర్యాదుపై సత్వర న్యాయం అందే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. దీనిపై అవగాహన లేని వారు టోల్ ఫ్రీ నంబర్ 155260కు ఫోన్‌చేసి వివరాలు వెల్లడిస్తే, నేరుగా పోర్టల్‌లో నమోదు చేస్తారన్నారు. తద్వారా ఫిర్యాదు నమోదైన వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్ ద్వారా బ్యాంక్‌కు సమాచారం చేరుతుందని.. సైబర్ క్రైంకు సంబంధించిన నగదు బదిలీలను నిలిపివేసి, బాధితులు నష్టపోకుండా నివారించే అవకాశం ఉందన్నారు. కొన్ని రోజులుగా అత్యధికంగా సైబర్ కేసుల నమోదుతో పాటు ఎంతో మంది ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు తమకు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, సైబర్ క్రైం డీఎస్పీ రత్నం, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, డీసీఆర్బీ ఎస్‌ఐ రవిప్రకాష్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment