కేంద్రాల్లో కనీస సౌకర్యాల కల్పన
శ్రీరంగాపూర్: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని.. నిర్ధేశించిన తేమశాతం వచ్చిన వెంటనే తూకం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మండలకేంద్రంతో పాటు నాగరాల, చెలిమిళ్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాలు, మట్టి లేకుండా ధాన్యం తీసుకొచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని, ధాన్యంలో తాలు లేకుండా చేసేందుకు ఫ్యాన్లు, సరిపడా గన్ని బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత త్వరగా నగదు వారి ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రాల నిర్వాహకులు సన్నరకం ధాన్యాన్ని గుర్తించడంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ రైస్‌మిల్లును సందర్శించి ధాన్యం దింపుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం దింపుకొన్న తర్వాత ట్రక్‌షీట్ పత్రాన్ని పీపీపీకి పంపించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ మురళి, వ్యవసాయ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment