బృహత్ ప్రణాళిక కోసం క్షేత్రస్థాయిలో భవనాలు, మురికివాడలు, గణాంకాలు, తాగునీటి అవసరాలు, సీసీ రోడ్లు, విద్యుత్ అవసరాలు తదితర వివరాలు లోతుగా సేకరించి ఒక తాత్కాలిక చిత్రాన్ని రూపొందిస్తారు. పట్టణ విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు బృహత్ ప్రణాళికలో ఉన్న నివాస సముదాయ ప్రాంతాలు, పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ, గ్రీన్ జోన్‌ల నిర్ధారణలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు పట్టణంలోని కొత్తకోట రోడ్డు ప్రాంతం ప్రస్తుత మాస్టర్‌ప్లాన్‌లో పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. కొత్త ప్రణాళిక అమలులోకి వస్తే నివాస ప్రాంతంగా మారనుంది. (బృహత్ ప్రణాళికలో కాకుండా ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్ జోన్‌గా గత ప్రభుత్వం మార్చింది గమనించగలరు) ఇలా పట్టణంలోని పలు ప్రాంతాల స్థితిగతుల్లో మార్పు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment